ఆటోలో ఎందుకో రావాల్సి వచ్చిందో వివరించిన హీరో !

Published on Jul 22, 2018 10:53 am IST

పాండిరాజ్ దర్శకత్వంలో తమిళ హీరో కార్తీ నటించిన చిత్రం చినబాబు . ఇటీవల విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది. ఈసందర్బంగా ఇటీవల ఈ చిత్రం యొక్క సక్సెస్ మీట్ ను ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటుచేయగా దానికి కార్తీ ఆటోలో వచ్చిన సంగతి తెలిసిందే. దాన్ని చూసి చాలా మంది కేవలం చిత్రాన్ని ప్రమోట్ చేయడానికే ఆటోలో వచ్చారని కామెంట్లు వచ్చాయి.

కాని ఎందుకు ఆలా రావాల్సివచ్చిందో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో కార్తీ వెల్లడించారు. సాయత్రం 7గంటలకు ప్రసాద్ లాబ్స్ లో పోగ్రాం పెట్టుకున్నాం. వైజాగ్ నుండి బయలుదేరాను తీరా ఇక్కడేమో వర్షం దానికి తోడు ట్రాఫిక్ జాం కారు కూడా ఆగిపోయింది. అప్పటికే రాత్రి 8:30 అవుతుంది ఇక లాభం లేదనుకొని కొంత దూరం నడిచాక ఆటో దొరికింది అందులో వచ్చేశా అని ఆయన వివరించారు.

ఇక కార్తీ రైతు పాత్రలో నటించిన ఈ చిత్రం కుటుంభ నేపథ్య కథ తో తెరకెక్కింది. తమిళ భాషలో తెరకెక్కిన ఈచిత్రాన్ని కార్తీ అన్నయ్య స్టార్ హీరో సూర్య నిర్మించారు. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సాయేషా కథానాయికగా నటిచింది.

సంబంధిత సమాచారం :