అరె ప్లాప్ దెబ్బకి యాక్షన్ తగ్గిస్తున్నారట !

అరె ప్లాప్ దెబ్బకి యాక్షన్ తగ్గిస్తున్నారట !

Published on Oct 31, 2019 11:34 PM IST

Gopichand2

సినిమా ప్లాప్ అయితే హీరోలు తమ తరువాత సినిమాల పై కాస్త ఎక్కువ జాగ్రత్త పడతారు. ప్రస్తుతం మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ ఆ జాగ్రత్త పడే పరిస్థితులోనే ఉన్నారు. గోపీచంద్‌ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్‌ నంది దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా చేస్తోంది.

కాగా బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్‌తో సాగే ఈ సినిమా బడ్జెట్ ను తగ్గించే ఆలోచనలో ఉందట చిత్రబృందం. చాణక్య రిజల్ట్ చూశాక.. సినిమాకి ఓవర్ బడ్జెట్ పెట్టి అది రాబట్టలేక చివరికి ప్లాప్ అనిపించుకోవడం గోపీచంద్ ఇష్టపడట్లేదని.. అందుకే ముందుగానే సాధ్యం అయినంతవరకు బడ్జెట్ తగ్గించమని గోపీచంద్ దర్శకుడికి చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో సంపత్ నంది బడ్జెట్ తగ్గించడానికి స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నారు. మెయిన్ గా యాక్షన్ సీన్స్ ను తగ్గించే పనిలో ఉన్నారట.

‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ (ప్రొడక్షన్‌ నెం. 3) పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు