హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో యాక్షన్ హీరో !

Published on Dec 2, 2019 9:01 am IST

హీరో గోపీచంద్ కెరీర్ కొన్నాళ్ళుగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో ఆశలతో చేసిన ‘చాణక్య’ కూడా నిరాశపరచడంతో అయోమయంలో పడిన ఆయన, తన పాత దర్శకుడు తేజతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తేజతో చేసిన ‘జయం, నిజం’ చిత్రాలతో ప్రతినాయకుడిగా నిలదొక్కుకున్న గోపీచంద్ ఈసారి హీరోగా తేజ దర్శకత్వంలో సినిమా చెయ్యాలనుకుంటున్నారు. తేజ సైతం తనకిష్టమైన గోపీచంద్‌తో కలిసి వర్క్ చేయడానికి సుముఖంగానే ఉన్నారని, ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది.

కాగా ఇప్పటికే గోపీచంద్ కి తేజ ఓ లైన్ ను చెప్పారని.. పూర్తిగా పాత్ర బలంతో నడిచే స్క్రిప్ట్ ను గోపీచంద్ కోసం రాస్తున్నారని తెలుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే యేడాది వీరి ప్రాజెక్ట్ పట్టాలైక్కే అవకాశముంది. ఇకపోతే గోపిచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇందులో తమన్నా కథానాయకిగా నటించనుంది.

సంబంధిత సమాచారం :

More