“సెహరి” చిత్రాన్ని మంచి క్వాలిటీతో తెరకెక్కించాం – హర్ష్ కనుమిల్లి

Published on Feb 8, 2022 2:00 am IST

హర్ష్ కనుమల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “సెహరి’. కొత్త దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుపుకుంది.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన హర్ష్ కనుమిల్లి “సెహరి” చిన్న సినిమానే కానీ, మాకున్న బడ్జెట్‌లో మంచి క్వాలిటీతో తెరకెక్కించామని అన్నాడు. దర్శకుడు జ్ణానసాగర్ పెద్ద దర్శకుడు అవుతాడనే నమ్మకం నాకుందని, ఇక కథానాయిక సిమ్రాన్ చౌదరి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అన్నాడు. ఈ సినిమాలోని “ర్యాప్ బ్యాటిల్” కొత్త అనుభూతిని ఇస్తుందని, అందుకే దానిని విడుదల చేయలేదని చెప్పాడు. నాన్ స్టాప్‌గా మిమ్మల్ని నవ్వించాలన్న ఆలోచనతోనే ఈ చిత్రాన్ని రూపొందించామని, ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని భావిస్తున్నట్టు తెలిపాడు.

సంబంధిత సమాచారం :