మరో సీనియర్ హీరోకి కరోనా పాజిటివ్ !

Published on Jan 23, 2022 9:30 pm IST

సీనియర్ హీరో ‘అల.. వైకుంఠపురములో’ ఫేం జయరామ్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని జయరామ్ తన ఇన్‌ స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందాల్సిన పనిలేదని జయరామ్ తెలిపారు. కాగా జయరామ్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. జయరామ్ కి నిన్నటి నుంచి తీవ్ర అనారోగ్యంగా ఉండటంతో వైద్యులు పరీక్షించగా ఆయనకు కరోనా అని తేలింది.

కరోనా మూడో వేవ్ లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. టాలీవుడ్ లో వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. అందరూ కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఏది ఏమైనా వరుసగా మళ్ళీ కేసులు వస్తుండడంతో.. మూవీ మేకర్స్ లో కూడా ఆందోళన మొదలైంది. షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వాల్సి వస్తోంది. జయరామ్, ప్రస్తుతం, ప్రభాస్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :