నేను చేసే ప్రతి కథ, సినిమా మీరు గర్వపడేలా ఉంటుంది – హీరో కార్తికేయ

నేను చేసే ప్రతి కథ, సినిమా మీరు గర్వపడేలా ఉంటుంది – హీరో కార్తికేయ

Published on Nov 7, 2021 3:01 AM IST


కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి. టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ కథానాయికగా కనిపించన్నారు. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బిగ్ టికెట్‌ను హీరోలు సుధీర్ బాబు, శ్రీవిష్ణు, విశ్వక్ సేన్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ మా ఈ ఫంక్ష‌న్‌కు పిలిచిన వెంట‌నే వ‌చ్చిన ‘దిల్’ రాజుగారు, సుధీర్ బాబుగారు, శ్రీవిష్ణు అన్నయ్య, విశ్వక్ సేన్, కిరణ్ ప్రతి ఒక్కరికీ థాంక్యూ అని, ‘రాజా విక్రమార్క’ చిరంజీవిగారి టైటిల్. ఆయన టైటిల్ పెట్టుకునేంత స్థాయి ఉందని అనుకోవడం లేదు. కానీ, చిన్నప్పటి నుంచి చిరంజీవిగారి సినిమా ఏది చూసినా అందులో మనల్ని మనం ఊహించుకుంటూ పెరిగాం. ‘గ్యాంగ్ లీడర్’ చూసినప్పుడు నేనే గ్యాంగ్ లీడర్ అనుకున్నా. ‘ఇంద్ర’, ‘ఠాగూర్’ ప్రతి సినిమా చూసినప్పుడు ఫ్యాన్స్ అలాగే ఫీలయ్యాం. ఆ అభిమానికి మించిన అర్హత లేదని ఫీలయ్యి… ధైర్యం చేసి టైటిల్ పెట్టేసుకున్నాను. నా సినిమాలు అన్నిటిలో నేను సొంతంగా టైటిల్ పెట్టుకున్నది ఈ సినిమాకే. ఇప్పటివరకూ ఎప్పుడూ ఇలా చేయలేదు. దర్శకుడు ముందు వేరే టైటిల్ అనుకుంటే బాగానే ఉందనుకున్నాం. ఫోనులో ‘రాజా విక్రమార్క’ పేరు కనిపిస్తే.. ఈ టైటిల్ పెడితే బావుంటుందని నాకు అనిపించింది. మా దర్శకుడికి ఇటువంటివన్నీ నచ్చవు. నేను అడిగే సరికి ఒక రోజు టైమ్ తీసుకుని సెట్ అవుతుందని చెప్పాడు. దాంతో నేను చాలా హ్యాపీ. చిరంజీవిగారి టైటిల్ దగ్గర నుంచి ఈ సినిమా నాకు చాలా స్పెషల్. సినిమాకు వస్తే… ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైన తర్వాత కథలు వింటున్న సమయంలో ఒక ఫ్రెండ్ ద్వారా శ్రీ సరిపల్లి కథ చెప్పాడానికి వచ్చాడు. విన్నాను. కథ నచ్చింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత కొన్ని సినిమాలు చేశా. అయితే, ఈ సినిమా నా సినిమా అన్నట్టు మనసులో ఒక కనెక్షన్ ఏర్పడింది. శ్రీ ఏ పని చేసినా నిజాయతీగా, శ్రద్ధగా చేస్తాడని ఫస్ట్ మీటింగ్ లో అనిపించింది. ఆ నమ్మకం ఈ సినిమా మీద కన్వర్ట్ అయ్యింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత రెండు మూడు సినిమాలు అటు ఇటు అయితే నా స్క్రిప్ట్ సెలక్షన్ ఏదోలా ఉంటుందన్నట్టు జనాలు ఫేస్ పెట్టేవాళ్లు. ‘నేను హిట్టు కొడుతున్నా చూడు’ అని లోపల వాళ్లకు కమ్యూనికేట్ చేయాలని అనిపించేది. మాస్ ఇమేజ్ కోసమనో, భారీగా విడుదల చేయవచ్చనో కొన్ని సినిమాలు చేస్తాం. ఈ సినిమా మాత్రం కథ విని, ఎగ్జైట్ అయ్యి శ్రీతో ట్రావెల్ అవ్వాలని చేశా. మనసులో అనిపించింది చేశా. చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలని మనసులో ఎందుకు అనిపించిందో తెలియదు. అనిపించింది. అలాగే, ఈ సినిమాకు అనిపించింది. ఈ సినిమా సక్సెస్ అవ్వడం నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నాకు నా మీద నమ్మకాన్ని ఇస్తుంది. అంత ఇంపార్టెంట్ మూవీ ఇది. ఈ సినిమా మేం ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాం. అప్పుడు ’90 ఎంఎల్’ స్టార్ట్ చేశాం. అదే సమయంలో వినోద్ రెడ్డిగారు ఆదిరెడ్డి, ’88’ రామారెడ్డిగారిని పరిచయం చేశారు. వాళ్లు మేం చేస్తామన్నారు. 2019లో సినిమా మొదలైంది. మధ్యలో నేను ‘చావు కబురు చల్లగా’ చేశా. తర్వాత కరోనా వచ్చింది. ఈ సమయంలో శ్రీ, అతని టీమ్ చాలా పాజిటివిటీతో ఉన్నారు. నాకు శ్రీతో మళ్లీ సినిమా చేయాలనుంది. మళ్లీ చేయాలంటే సినిమా సక్సెస్ అవ్వాలి. మనం మంచి మనసుతో బలంగా కోరుకుంటే జరుగుతుంది. ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. ’88’ రామారెడ్డి, ఆదిరెడ్డిగారికి థాంక్స్. వాళ్లకు నిర్మాణం కొత్త అయినా… నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.

కష్టపడి బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాను. వాళ్లకు హిట్ ఇచ్చి సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటాను. సాయికుమార్ గారు, సుధాకర్ కోమాకుల, తాన్యా రవిచంద్రన్, హర్షవర్ధన్ గారు … అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అద్భుతంగా నటించారు. నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య ఈ సినిమాలో నటించాడు. బెస్ట్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఈ సినిమాకు కుదిరింది. నాకు ‘గ్యాంగ్ లీడర్’, ‘చావు కబురు చల్లగా’ సినిమాలకు మంచి పేరొచ్చింది. కానీ, ‘ఆర్ఎక్స్ 100’ రేంజ్ కమర్షియల్ హిట్ రాలేదు. అయినా ‘ఈ సినిమా హిట్టవుతుంది. బావుంటుంది’ అని నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న, నన్ను నమ్ముతున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి 100 శాతం కష్టపడతా. ‘రాజా విక్రమార్క’తో మొదలుపెట్టి నేను ఎంపిక చేసుకునే ప్రతి కథ, నేను చేసే ప్రతి సినిమా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తానని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు