వైఎస్ఆర్ బయోపిక్ లో హీరో ఖరారు !
Published on Mar 2, 2018 8:39 am IST

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా ఓ బయోపిక్‌ రాబోతోంది. మహిత్ రాగవ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. గతంలో ఈ దర్శకుడు ఆనందో బ్రహ్మ సినిమాకు దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్ వర్క్ స్టేజి లో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెల్లబోతోంది. వైఎస్ ఆర్ పాత్రలో మలయాళం నటుడు మమ్ముట్టి నటించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజా సమాచారం మేరకు మమ్ముట్టి ఈ సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.

గతంలో దర్శకుడు పూరి జగన్నాథ్‌ నటుడు రాజశేఖర్‌తో కలిసి వైఎస్సార్‌ బయోపిక్‌ తీయాలని అనుకున్నారు, కాని కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ ప్రాజెక్ట్ మొదలుకాలేదు. వైఎస్ఆర్ బయోపిక్ సినిమాకు యాత్ర అనే టైటిల్ పరిశీలనలో ఉంది. రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర అతని జీవిత అంతరంగం గురించి ఈ సినిమాలో ప్రదానంగా డిస్కస్ చెయ్యబోతున్నట్లు సమాచారం.

 
Like us on Facebook