నెటిజెన్ కామెంట్ కి మాధవన్ అదిరిపోయే కౌంటర్ …!

Published on Aug 17, 2019 1:24 pm IST

తమిళ పరిశ్రమకు చెందిన ఆర్ మాధవన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.ఆయన నటించిన సఖి, చెలి, యువ చిత్రాలు తెలుగులో కూడా మంచి ఆదరణ దక్కించుకున్నాయి. కాగా మాధవన్ తాజాగా నటి అనుష్క తో కలిసి సైలెంట్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం ఈఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం కలదు.

ఐతే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినం, రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని సంప్రదాయ బట్టలలో తండ్రి కొడుకులతో దిగిన ఫోటో ఒకటి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఐతే ఆ ఫోటోని బాగా గమనించిన ఓ నెటిజెన్ ” ఎక్కడైనా హిందువుల పూజా మందిరాలలో జీసస్ ఫోటోలు,సిలువలు ఉంటాయా, ఇదంతా సెట్ అప్, మీపైన నాకు రెస్పెక్ట్ పోయిందంటూ ఫోటోకి కామెంట్ పెట్టారు.

దీనికి స్పందించిన మాధవన్ నీలాంటి సంకుచిత భావాలు కలిగిన వారి రెస్పెక్ట్ నాకు అవసరం లేదు. నేను స్వరమతాలను గౌరవిస్తాను, అన్ని మతాల దేవుళ్లను పూజిస్తాను, చర్చిలకు,మసీదులకు వెళతాను” అంటూ కౌంటర్ ఇచ్చారు. దీనితో ఇప్పుడు మాధవన్ దిగిన ఆ ఫోటో సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :