‘మోసగాళ్లు’ కోసం షూట్ మొదలెట్టిన మంచు విష్ణు !

Published on Feb 6, 2020 3:00 am IST

మంచు విష్ణు హీరోగా వస్తోన్న ‘మోసగాళ్లు’ సినిమా కోసం తనకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్రారంభించారు మంచు విష్ణు. ప్రపంచపు ఎంటర్టైన్మెంట్ రాజధానిగా ప్రసిద్ధిపొందిన లాస్ ఏంజెల్స్ లో తీస్తున్న ఇంపార్టెంట్ సీన్లలో ఆయన పాల్గొంటున్నారు. నియాన్ లైట్లతో వెలిగిపోయే లాస్ ఏంజెల్స్ నగరం ‘మోసగాళ్లు’కు సరిగ్గా సరిపోయే నేపథ్యాన్ని అందిస్తోందని చెప్పవచ్చు. చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఈ సినిమా ఛేదిస్తుంది. ఈ లాస్ ఏంజెల్స్ షెడ్యూల్ పది రోజుల పాటు జరుగుతుంది.

కాగా ఈ మూవీలో విష్ణుతో పాటు అందాల తార కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి మరో రెండు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. కొద్ది నెలలుగా జరుగుతూ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటోంది. సినిమాలో విష్ణు పోషిస్తున్న క్యారెక్టర్ చాలా ఇన్టెన్స్ గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. టెర్రిఫిక్ స్టోరీ, క్యారెక్టరైజేషన్, యాక్షన్ మేళవిపుంతో తయారవుతున్న ‘మోసగాళ్లు’ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఇటీవల ఈ సినిమాలో తన లుక్ ఆవిష్కరణ సందర్భంగా “నేను మంచివాడినా, చెడ్డవాడినా? జడ్జి మీరే” అని తన అభిమానుల్ని అడిగారు విష్ణు.
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర వంటి పేరుపొందిన యాక్టర్లు నటిస్తోన్న ‘మోసగాళ్లు’ 2020 సమ్మర్ లో విడుదలకు సిద్ధమవుతోంది.

సంబంధిత సమాచారం :