మోహన్ బాబు’కు జైలు శిక్ష వార్తల పై.. ‘మోహన్ బాబు’ రియాక్షన్ !

Published on Apr 2, 2019 3:32 pm IST

రాజకీయాల్లో యాక్టివ్ అయిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు అప్పుడే షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు ఒక సంవత్సరం జైలు శిక్ష పడిందని కొన్ని టీవీ ఛానల్స్ లో వార్తలు రావడంతో అది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయింది. కాగా అసలు విషయంలోకి వెళ్తే.. 2010లో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన “సలీం”చిత్రానికి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆ సినిమా సమయంలో వైవిఎస్ చౌదరికి ఇచ్చిన 48 లక్షల చెక్ బౌన్స్ అయిందట. ఈ విషయంలో వైవిఎస్ చౌదరి కేసు వేసారు.

ఆ కేసు ఇప్పుడు తుది తీర్పుకు వచ్చింది. ఎర్రమంజిల్ న్యాయస్థానం వారు మంగళవారం తీర్పునిస్తూ మోహన బాబుకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించదని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు పై స్పందించిన మోహన్ బాబు తన పై కొన్ని తప్పుడు వార్తలను కొన్ని టీవీ నెట్ వర్క్స్ వారు ప్రచారం చేస్తున్నారని, నేను ప్రస్తుతం హైదరాబాద్ లోని నా స్వగృహంలోనే ఉన్నానని ఆయన ట్వీట్ చేసారు.

సంబంధిత సమాచారం :