మళ్ళీ సెట్స్ పైకి నాగార్జున‌-ప్ర‌వీణ్ స‌త్తారు మూవీ..!

Published on Jul 15, 2021 2:06 am IST


యాక్షన్ కింగ్ అక్కినేని నాగార్జున‌, ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సడెన్‌గా ఆగిపోయింది. అయితే నాగార్జున‌, ప్ర‌వీణ్ స‌త్తారు మ‌ధ్య వ‌చ్చిన సృజ‌నాత్మ‌క విభేధాల కార‌ణంగానే ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయినట్టు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది.

దర్శకుడు ప్ర‌వీణ్ స‌త్తారు నాగ్ సూచ‌న‌ల మేరకు కథలో మార్పులు చేసినట్టు తెలుస్తుంది. దీంతో ఈ ఇద్ద‌రు మళ్లీ ఈ సినిమాను తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యార‌ని, వ‌చ్చే వార‌మే ఈ ఇద్ద‌రి ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని తెలుస్తుంది. ఇదిలా ఉంటే స్పై డ్రామాగా యాక్ష‌న్ అండ్ అడ్వంచ‌ర్ క‌థాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.

సంబంధిత సమాచారం :