నాని పాత్ర రంగస్థలం చిట్టిబాబును తలపిస్తుందట..!

Published on May 21, 2020 8:26 am IST

హీరో నాని నిన్న ఓ కొత్త మూవీ ప్రకటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల దర్శకుడిగా ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా ఈ చిత్రంలో నాని పాత్ర పై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో నాని పాత్ర రంగస్థలంలో చరణ్ చేసిన చిట్టి బాబును పోలి వుంటుందట. ఈ మూవీ ద్వారా ఓ ఛాలెంజింగ్ రోల్ నాని ట్రై చేయబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో కృష్ణార్జున యుద్ధం మూవీలో నాని రాయలసీమ పల్లెటూరి కుర్రాడి పాత్ర చేశాడు. ఐతే ఈ పాత్ర మరింత డార్క్ షేడ్స్ కలిగి ఉంటుందని సమాచారం.

ఇక నాని నటించిన వి మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. లాక్ డౌన్ అనంతరం ఈ మూవీ విడుదల కానుండగా నాని సీరియల్ కిల్లర్ రోల్ చేయడం విశేషం. అలాగే దర్శకుడు శివ నిర్వాణతో టక్ జగదీష్ అనే మరో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో నాని నటిస్తున్నారు. ఈ మూవీలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More