ఆ దర్శకుడితోనే నాని మరో సినిమా చేయనున్నాడట?

Published on Jun 22, 2022 2:49 am IST

న్యాచురల్ స్టార్ నాని ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడన్న సంగతి తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి హీరో వరకు ఎదిగిన నాని కొంతకాలం తన సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత నాని చేస్తున్న సినిమాలు పెద్దగా కమర్షియల్‌ సక్సెస్ అందుకోలేకపోయాయి.

అయితే “భలేభలేమగాడివోయ్‌” సినిమాను తెరకెక్కించిన మారుతితో నాని ఓ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నాని.. దసరా అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. మరోవైపు మారుతి కూడా తాను తెరకెక్కించిన పక్కా కమర్షియల్ చిత్రం రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరి వీరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా లేదా తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :