ఆ హిట్ మూవీ సీక్వెల్ కి నిర్మాతగా హీరో నాని…!

Published on Jul 10, 2019 8:36 am IST

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ ప్రధాన పాత్రలలో దర్శకుడు స్వరూప్ తెరకెక్కించిన “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” చిత్రం ఇటీవల విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకొంది. కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ చేయాలనే యోచనలో ఉన్నారట చిత్ర బృందం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారని సమాచారం. ఐతే మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే మొదటి భాగానికి నిర్మాతగా ఉన్న రాహుల్ యాదవ్ తో కలిసి హీరో నాని “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” చిత్ర సీక్వెల్ ని నిర్మించనున్నారట.

ఈ మూవీ విడుదలకు ముందే ప్రత్యేక షో చూసిన నాని ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ కాన్సెప్ట్ అలాగే డైరెక్టర్ స్వరూప్ దర్శకత్వ ప్రతిభ నచ్చడంతో నాని ఈ మూవీ సీక్వెల్ నిర్మాణ భాగస్వామి కావాలని నిర్ణయించుకున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కలదు. గతంలో కూడా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో “అ!” అనే చిత్రానికి నాని నిర్మాతగా వ్యవహరించారు.

సంబంధిత సమాచారం :

X
More