వ్యాక్సినే క్షేమం, క్షేమం కోసమే వ్యాక్సిన్‌ – నాని

Published on Jun 26, 2021 11:39 pm IST

నేచురల్‌ స్టార్‌ నాని తాజాగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అయితే తానూ వ్యాక్సిన్ తీసుకున్న ఫొటోని షేర్‌ చేస్తూ.. ‘మనకుంది రెండు ఆప్షన్లే. వాటిలో ఏదో ఒకటి సెలక్ట్‌ చేసుకోండి. కాబట్టి వ్యాక్సిన్‌ వేయించుకుని.. క్షేమంగా ఉందాం. గుర్తు పెట్టుకోండి, కనీసం మన క్షేమం కోసం అయినా వ్యాక్సిన్‌ వేయించుకుందాం’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా నాని చేసిన ఈ ట్వీట్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుండటం విశేషం.

ఏది ఏమైనా ఈ కరోనా మహమ్మారి సామాన్య జనం దగ్గర నుండి సినీ ప్రముఖుల వరకూ అందర్నీ ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కరోనాకి ముందు కరోనాకి తరువాత అన్నట్టు ఉంది ప్రస్తుత స్థితి. అసలు థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో.. ఓపెన్ అయ్యాక మళ్ళీ మూడో వేవ్ వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ అంతుచిక్కని సమస్యగా మారి ప్రతి ఒక్కరిలో ఒక భయం కమ్ముకుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. థియేటర్లు ఓపెన్ అయ్యాక, నాని ముందుగా ‘టక్ జగదీష్’ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. పైగా తనకు ‘నిన్ను కోరి’ లాంటి ఎమోషనల్ హిట్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :