నానితో ఇంద్రగంటి ‘వ్యూహం’ !

Published on Mar 31, 2019 5:41 pm IST

సున్నితమైన అంశాలతో బలమైన భావోద్వేగాలతో సినిమాలను తియ్యడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని కలిగిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. కాగా తాజాగా ఇంద్రగంటి తన తరువాత సినిమాని నానితో చేయనున్న విషయం తెలిసందే. ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమా థ్రిల్లర్‌ అంశాలతో సాగుతుందని.. సినిమాలోని హీరోకి విలన్ కి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయట. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసిన ఇంద్రగంటి.. త్వరలో సినిమాను మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నాడు.

సంబంధిత సమాచారం :

More