“ధ్వని” ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన హీరో నవదీప్!

dhwani
వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను, విభిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ హీరో వినయ్ పనిగ్రహి ధ్వని అనే డిఫ‌రెంట్ మూవీతో ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. గురువారం ధ్వని చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ ను హీరో నవదీప్ గారు విడుద‌ల చేయడం జరిగింది. ఈ సందర్భంగా హీరో నవదీప్ మాట్లాడతూ, డైరెక్టర్ దుర్గ తనకు రెండు సంవత్సరాలుగా తెలుసు అని, ఆయనలో చాలా కృషి మరియు పట్టుదల ఉందని, ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అని అన్నారు.

ఫ‌స్ట్‌లుక్‌ను గ‌మ‌నిస్తే సీరియ‌స్‌గా తలకి కట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హీరో ఉన్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం లో సౌండ్ కి సంబందించిన వ్యాధితో బాధపడే ఒక వ్యక్తి జీవితం లో జరిగిన సంఘటనలు, ఆ సంఘటనల నుండి ఎలా బయటపడ్డాడు అనేది మూవీ కాన్సెప్ట్ అంటూ చిత్ర యూనిట్ పేర్కొనడం జరిగింది.

లుక్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంది, క‌థానాయ‌కుడి పాత్ర స‌రికొత్త డైమ‌న్ష‌న్‌లో ఉంటుంద‌ని ఈ ఫస్ట్ లుక్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. పరమ కృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ పతాకంపై పరమ కృష్ణ సాన సమర్పణలో సాధన నన్నపనేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ నాగ దుర్గ రావు సాన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం చివరి దశలో ఉంది. యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్రతిక్ అబ్యాంకర్ మరియు ఆనంద్ నంబియర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ ఎంఆర్. రాజకీష్ణన్ గారు సౌండ్ మిక్సింగ్ కి పనిచేస్తున్నారు.

Exit mobile version