ఇంటర్వ్యూ : న‌వీన్ పొలిశెట్టి – ఇది హిలేరియ‌స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌ !

Published on Jun 20, 2019 4:00 pm IST

స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా వస్తోన్న చిత్రం `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌`. ఈ చిత్రం జూన్ 21న విడుద‌ల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా హీరో న‌వీన్ పొలిశెట్టి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

 

ముందుగా, `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ` గురించి చెప్పండి ?

 

ఒక కేసు కూడా రాని డిక్టేటివ్ కి ఒక పెద్ద కేసు వస్తే.. దాన్ని అతను ఎలా హ్యాండిల్ చేశాడు అనేదే సినిమా. తెలుగులో డిక్టేటివ్ జోనర్ లో సినిమాలు ఈ మధ్యకాలంలో రాలేదు. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయి.

 

అసలు, సినిమా పై మీకు ఎప్పుడు ఆసక్తి కలిగింది ?

 

చిన్నప్పటినుండి సినిమాలంటే బాగా ఇంట్రస్ట్. అయితే స్కూల్ లో ఉన్నప్పుడు మా ఉపాధ్యాయులందరూ ఒకరు నాటకం చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ టైంలో మా టీచర్ నన్ను నాటకంలో ఓ చిన్న పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర ఏంటంటే.. ఒకసారి నవ్వటం. ఆమె కూడా అలాగే నవ్వమని కోరింది. నేను అలాగే చేసాను. అందరూ మెచ్చుకున్నారు. అలా నటన పై ఆసక్తి ఏర్పడింది.

 

మరి సినిమాల్లోకి ఎలా ఎంటర్ అయ్యారు ?

 

మా నాన్నగారి బలవంతం మీద నేను ఐఐటి రాసి భోపాల్‌ కు వెళ్లాల్సి వచ్చింది. కానీ అక్కడ ఆరు నెలలు ఉండేసరికి నాకు అర్ధం అయింది. ఇక ఫ్రెండ్స్ తో థియేటర్ క్లబ్‌ లో యాక్ట్ చేశాను. కాకపోతే చిన్న చిన్న పాత్రలే. అలా నా కాలేజీలో ఆ నాలుగు సంవత్సరాలు నన్ను నటనకు దగ్గర చేసింది.

 

మీరు ఎందుకు టాలీవుడ్‌ లో మీ నటన ప్రస్థానం ప్రారంభించలేదు ?

 

సినిమాల్లోకి రావడానికి చాలా ఒత్తిడి ఎదురుకోవాల్సి వచ్చింది. బొమ్మరిల్లు క్లైమాక్స్ గుర్తుందా ? సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు నాకు మరియు మా నాన్నగారి మధ్య ఇది పునరావృతమైంది. అయితే తెలుగులో డైరెక్ట్ గా హీరోగా ఎంటర్ అవ్వడం నాకు ఆ టైంలో అసాధ్యం అనిపించింది. ఆ తర్వాత నేను ముంబైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ముంబైలో నాటకాలతో నా కెరీర్ ప్రారంభించాను.

 

ఈ సినిమా దర్శకుడు స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె మిమ్మల్ని పేస్ బుక్ లో అప్రోచ్ అయ్యారంట ?

 

అవును. స్వ‌రూప్ నాకు కథ చెప్పినప్పుడే చాలా బాగా నచ్చింది. నిజానికి కొంతమంది హీరోలు ఈ సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపిన తను నా కోసమే వెయిట్ చేసి నాతొ ఈ సినిమా చేశాడు. అలా మేమిద్దరం సుమారు ఏడు ఎనిమిది నెలలు ట్రావెల్ అయ్యాం. ఆ తరువాతే నిర్మాతను కలిసాము.

 

మీ సినిమా కెరీర్ కి ముంబై జర్నీ ఏమైనా ఉపయోగపడిందా ?

 

ఖచ్చితంగా ఉపయోగపడింది. నాకు పరిశ్రమను అర్థం చేసుకోవడానికి అది చాల సహాయపడింది.

 

మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి ?

 

రెండు కథలు విన్నాను. బాగున్నాయి, హిందీలో కూడా ఓ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాను. ప్రస్తుతం అయితే ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను.

సంబంధిత సమాచారం :

More