ఈ కష్ట కాలంలో అనేక మందికి అండగా హీరో నిఖిల్.!

Published on May 11, 2021 11:10 pm IST


మన టాలీవుడ్ తన సినిమాలతో మంచి బెంచ్ మార్క్ ను సెట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ ఇప్పుడు కూడా పలు ఇంట్రెస్టింగ్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కానీ మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో తన సినిమా షూటింగ్ నుంచి కొంత కాలం విరామం తీసుకున్నాడు. మరి అలాగే ఈ కష్ట కాలంలో సైలెంట్ గా ఉండకుండా తన శాయశక్తులా కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం అందిస్తున్నాడు.

ఎవరికైనా రక్తం అవసరం అయితే అరేంజ్ చేస్తున్నాడు ఆర్ధికంగా ఎవరికైనా సాయం కావాలి అంటే పంపుతున్నాడు. అలాగే ఆక్సిజెన్ సిలిండర్లు నుంచి అవసరైన మెడిసిన్స్ వరకు కూడా నిఖిల్ సిద్ధార్థ్ తన వంతు సాయం అందిస్తూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అందరితో టచ్ లో ఉంటున్నాడు. మరి ఈ సమయంలో ఎందరికో సాయం చేస్తున్న నిఖిల్ గ్రేట్ మూవ్ ను మెచ్చుకొని తీరాల్సిందే.

సంబంధిత సమాచారం :