చైనా యాప్స్ బ్యాన్ చేయొద్దంటున్న నిఖిల్

Published on Jun 30, 2020 4:53 pm IST

అత్యంత ప్రజాదరణ కలిగిన సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ని బ్యాన్ చేయడం సరికాదని హీరో నిఖిల్ అన్నారు. ఆయన సోషల్ మీడియా వేదికగా మన దేశాన్ని, జీవన విధానాన్ని, ప్రజాస్వామిక వ్యవస్థను వారు గౌరవించినంత కాలం..వారి యాప్స్ మనం బ్యాన్ చేయకూడదు అన్నారు. భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో టిక్ టాక్ లాంటి చైనా యాప్స్ అనేక సెక్యూరిటీ సమస్యలకు కారణం అవుతాయని భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక నిఖిల్ స్టేట్మెంట్ కి నెటిజెన్స్ నుండి మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు నిఖిల్ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఉండగా.. కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇక ఇటీవలే తన ప్రేయసి డాక్టర్ పల్లవిని వివాహం చేసుకున్నాడు నిఖిల్. ఆయన ప్రస్తుతం దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More