ట్రాఫిక్ తట్టుకోలేక మెట్రో ఎక్కిన హీరో

Published on Jun 21, 2019 8:15 pm IST

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తీవ్రంగా పెరిగాయి. ఇక ఒక మోస్తరు వర్షం పడితే ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. డ్రైనేజ్ సమస్యతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి గంటల కొద్ది రోడ్ల మీదే ఉండాల్సిన పరిస్థితి. ఈ కష్టం కేవలం సామాన్య జనాన్నే కాదు సెలబ్రిటీలను కూడా తాకింది.

ఈరోజు సాయంత్రం కురిసిన వానకు హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రధాన ఏరియాలు జామ్ అయిపోయాయి. దీంతో హీరో నితిన్ షూటింగ్ నుండి ఇంటికి వెళ్ళడానికి తన కారుకి బదులు మెట్రో ఎక్కారు. ఒక్కసారిగా హీరో మెట్రోలో కనిపించడంతో ప్రయాణీకులు కొంచెం షాకై తర్వాత ఆయనతో సెల్ఫీలు దిగారు. నితిన్ కూడా మెట్రో ప్రయాణం కొత్త అనుభవమని, బాగా ఎంజాయ్ చేశానని అంటున్నారు. ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుములు దర్శకత్వంలో ‘భీష్మ’ అనే సినిమా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More