నూతన దర్శకుడు కిషోర్ కుమార్ దర్శకత్వంలో హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రగా రాబోతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను తాజాగా హీరో నితిన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఫస్ట్ లుక్ లో రాయ్ లక్ష్మీతో పాటు పూజిత పొన్నాడ కూడా హైలెట్ గా నిలిచింది.
ఇక ‘ఖైదీ నెం 150’ మరియు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాల్లోని ప్రత్యేక పాటల్లో నటించి మెప్పించిన రాయ్ లక్ష్మి, మళ్లీ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ చిత్రంతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తుండగా.. రంగస్థలం ఫేమ్ పూజిత పొన్నాడ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రను పోషిస్తుంది.
ఈ చిత్రాన్ని ఏబీటీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందిస్తోంది. ఈ సినిమాలో నవీన్ నేని, మహాత్ మరియు పంకజ్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని హాస్యం ప్రేక్షకులను బాగా అలరిస్తోందని చిత్రబృందం నమ్మకంగా చెబుతుంది.
Best wishes to director @creatorkrish, ABT Creations, #Praveen,#Madhunandan, @iamlakshmirai and the entire team of #WhereIsTheVenkatalakshmi. Here is the first look.goodluck?? pic.twitter.com/djfxlrI71Y
— nithiin (@actor_nithiin) November 4, 2018


