‘భీష్మ’లో నితిన్ కూల్ లుక్, కేకపుటిస్తున్నాడుగా.

Published on Jul 11, 2019 9:29 am IST

యంగ్ హీరో నితిన్ తన చివరి చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’ విడుదలైన సంవత్సరం తర్వాత ఏకంగా మూడు చిత్రాలు వరుసగా ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేశారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో “భీష్మ” చేస్తున్న నితిన్, వెంకీ అట్లూరి దర్శకుడిగా తెరకెక్కుతున్న రంగ్ దే చిత్రంతో పాటు,విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయని సమాచారం.

‘భీష్మ’ చిత్రంలోని నితిన్ లుక్ తాజాగా రివీల్ కావడం జరిగింది.వైట్ ప్యాంటు, బ్లాక్ టి షర్ట్ టక్ ఇన్ చేసి, మైక్ ముందు నిలబడి ఎవరినో అడ్రెస్ చేస్తూ మాట్లాడుతున్నట్లున్న నితిన్ లుక్ కూల్ మరియు క్లాసిక్ గా ఉంది. నితిన్ లుక్ చూస్తుంటే ఈ చిత్రంలో ఈయన ఎంప్లాయ్ నా లేక కంపెనీకి ఓనరా అనే డౌట్ కలుగుతుంది. ‘భీష్మ’ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందాన నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More