ఆ టాలెంటెడ్ డైరెక్టర్ తో నితిన్ మరో మూవీ మొదలెట్టేశాడు.

Published on Jun 23, 2019 9:14 am IST

యంగ్ హీరో నితిన్ స్పీడ్ మాములుగా లేదు,ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “భీష్మ” సెట్స్ పై ఉంగానే మరో మూవీ మొదలుపెట్టేశాడు. గత చిత్రం”శ్రీనివాస కళ్యాణం” తరువాత దాదాపు సంవత్సరం ఖాళీగా ఉన్న నితిన్ వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో నేడు అధికారికంగా చిత్రాన్ని ప్రారంభించేశారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

నితిన్ సరసన రకుల్ ప్రీత్ తో పాటు,ఒక్క కన్నుగీటుతో హోల్ ఇండియా ఫేమస్ అయిన ప్రియా వారియర్ మొదటిసారిగా తెలుగులో నటిస్తుంది. భవ్య ఆనంద్ మరియు ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి సంగీతం సీనియర్ సంగీత దర్శకులు కీరవాణి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More