సీనియర్ హీరోయిన్ కి స్వీట్లు పంపిన ప్రభాస్ !

Published on Jul 4, 2021 11:21 pm IST

సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీకి స్వీట్లు అంటే ఇష్టం. 50 ప్లస్ ఏజ్ లో కూడా చాలా యంగ్ గా కనిపిస్తోన్న ఈ సీనియర్ హీరోయిన్ తాజాగా ఈ బ్యూటీ హైదరాబాద్ కి వచ్చింది. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ షూటింగ్ లో పాల్గొనేందుకు సిటీకి వచ్చింది. అయితే ఆమెకు మంచి స్వాగతం లభించింది. భానుశ్రీకి స్వీట్లు అంటే ఇష్టం కాబట్టి, నేషనల్ స్టార్ ప్రభాస్ నుండి ఆమెకు ఊహించని గిఫ్ట్ అంది.

వెల్లంకి స్వీట్ షాప్ నుంచి తెప్పించిన పూతరేకుల స్వీట్ డబ్బాలను గిఫ్ట్ బాక్స్ లో ప్రత్యేకంగా భానుశ్రీకి పంపించాడు ప్రభాస్. దాంతో ఈ సీనియర్ హీరోయిన్ ఒక్కసారిగా థ్రిల్ అయిపోయింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రభాస్ ప్రత్యేక థాంక్స్ చెప్పింది. ఇక ‘రాధేశ్యామ్’ సినిమాలో భానుశ్రీ ప్రభాస్ కి తల్లిగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఈ నెలతో పూర్తి కానుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :