నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. తాజాగా ప్రకాశ్‌రాజ్, హీరో రామ్ కలిసి ‘హలో గురు ప్రేమకోసమే…’ చిత్రంలో ఓ పాట పాడారు. మ్యూజిక్ సంచలనం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో ‘ఫ్రెండ్ కోసం మారొచ్చు ట్రెండు’ అనే సాంగ్ ని రామ్, ప్రకాశ్‌రాజ్ చాలా చక్కగా పాడారట.
ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె ఇంజనీరింగ్ స్టూడెంట్ పాత్ర పోషిస్తున్నారు. పైగా రామ్ – అనుపమా బావ మరదళ్లగా కనిపించనున్నారు. అనుపమా తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కి రామ్ కి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా అలరిస్తాయని చిత్రబృందం నమ్మకంగా ఉంది. ‘ఫ్రెండ్ కోసం మారొచ్చు ట్రెండు’ పాట వారి మధ్య చాలా సరదాగా సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 18న విడుదల చేయనున్నారు.


