ఇస్మార్ట్ రామ్ కన్ఫ్యూజ్ అవుతున్నాడా?

Published on Aug 31, 2019 3:11 pm IST

రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ రూపంలో సాలిడ్ హిట్ అందుకున్నారు. తన కెరీర్ లోనే అతిపెద్ద హిట్ చిత్రాలలో ఒకటిగా ఇస్మార్ట్ శంకర్ నిలిచింది. రామ్ రెడీ మూవీ తరువాత విడుదలైన కందిరీగ, నేను శైలజ వంటి చిత్రాలు మాత్రమే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. రీసెంట్ గా విడుదలైన హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ వంటి చిత్రాలు పాజిటివ్ టాక్ తెచుకున్నప్పటికీ, హిట్ చిత్రాలుగా నిలబడలేదు.

పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మాత్రమే ఆయనకు ఓ క్లీన్ హిట్ ని కట్టబెట్టింది. దీనితో ఇకనైనా కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేయాలని భావిస్తున్నాడట రామ్. అందుకే సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడట. అంతే కాక, ఇస్మార్ట్ శంకర్ లాంటి ఊర మాస్ చిత్రం తరువాత ఎటువంటి చిత్రం చేస్తే బాగుంటుందనే సందిగ్ధంలో ఉన్నారట. ఆయన ఫ్యాన్స్ మాత్రం కొత్త చిత్ర ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :