చాల ఏళ్లకు సెట్ అయిన హిట్ కాంబినేషన్ ?

Published on Mar 30, 2021 1:00 am IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి మొదటి అవకాశం ఇచ్చింది హీరో రవితేజ. అయితే తనను డైరెక్టర్ ను చేసిన రవితేజతో బోయపాటి మళ్ళీ ఇంతవరకూ సినిమా చేయలేదు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం బోయపాటి తన తరువాత సినిమాని రవితేజతో చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బోయపాటి శ్రీను రవితేజ కోసం ఓ స్క్రిప్టును సిద్ధం చేసాడట.

కాగా ఈ సినిమా ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా ఉండనుందని.. ముఖ్యంగా రవితేజకు సరిపడే స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేశాడట. మరి ఇప్పుడు రవితేజ – బోయపాటి కాంబినేషన్ అంటే భారీ అంచనాలు ఉంటాయి. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక బోయపాటి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. మరో నాలుగు నెలల్లో ఈ సినిమా పూర్తి కానుంది.

సంబంధిత సమాచారం :