హిట్ కోసం సూపర్ హిట్ ఫిల్మ్ ను.. !

Published on Mar 12, 2019 11:02 am IST

‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తమిళ చిత్రం ‘తేరి’ రీమేక్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. కాగా ఏప్రిల్ 15 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఈ చిత్రంలో రవితేజ సరసన కాజల్ అగర్వాల్, క్యాథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కాగా తేరి స్క్రిప్ట్ లో సంతోష్ శ్రీనివాస్ తెలుగుకు అనుగుణంగా పలు మార్పులు చేశారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి మరియు మాడ్యులేషన్ కు తగ్గట్లు హీరో క్యారెక్టరైజేషన్ మార్చాడట శ్రీనివాస్. మరి ఆ మార్పులు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం :