“ది 100” సినిమాతో రాబోతున్న ఆర్.కె. సాగర్..!

“ది 100” సినిమాతో రాబోతున్న ఆర్.కె. సాగర్..!

Published on Aug 11, 2021 8:45 PM IST

100

కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకోవడంతో ‘షాదీ ముబారక్’ మూవీతో జనం ముందుకు వచ్చిన ఆర్. కె. సాగర్ ఇప్పుడు “ది 100” సినిమాతో రాబోతున్నాడు. రాఘవ్ ఓంకార్ శశిధర్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్న ఈ సినిమాను ఆర్.కె. మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తోంది.

అయితే ఈ సంబంధించి తాజాగా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రంలో ఆర్‌.కె. సాగ‌ర్ విక్రాంత్ అనే పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కనిపించబోతున్నాడు. యూనిఫామ్‌లో చేతిలో గ‌న్ ప‌ట్టుకుని వెన‌క్కి తిరిగి నిల‌బ‌డిన ఆర్‌.కె. సాగ‌ర్ ఇంటెన్సివ్ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.

తాజా వార్తలు