బన్నీ పై వస్తోన్న ఆ వార్తలన్నీ అవాస్తవం – సాయిధరమ్ తేజ్

Published on Apr 19, 2019 2:00 am IST

మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘చిత్రలహరి’. కాగా సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో డీసెంట్ వసూళ్లను రాబడుతూ.. సాయి తేజ్ ఖాతాలో మరో హిట్ చిత్రంగా నిలిచింది. ఇక బన్నీతో తనకు గొడవలు జరిగాయి అని సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు పై సాయి తేజ్ స్పందించాడు.

సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. నేను తరుచుగా వరుణ్ తేజ్, రామ్ చరణ్ లను కలుస్తుంటాను, కానీ బన్నీతో ఎప్పుడో ఒకసారి గాని కలవను. అయితే కలిసినప్పుడు మాత్రం మేం చాలా బాగా ఉంటాం. మా మధ్య ఎక్కువుగా సినిమాల గురించి చర్చలు జరుగుతాయి. అయిన బన్నీ నేను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. అలాంటి మా మధ్య గొడవలు ఎందుకు వస్తాయి.. ? మీడియాలో వస్తోన్న ఈ వార్తలన్నీ పూర్తి అవాస్తవం అని సాయి తేజ్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :

X
More