ట్రెడిషనల్ టైటిల్ తో శర్వానంద్ కొత్త మూవీ ప్రారంభం.

Published on Jun 30, 2019 11:09 am IST

యంగ్ హీరో శర్వానంద్ నేడు “శ్రీకరం” అనే మరో కొత్త సినిమాను ప్రారంభించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శర్వానంద్ పై క్లాప్ కొట్టగా,శశి కాంత్ వల్లూరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతుండగా, 14రీల్స్ పతాకం పై గోపీచంద్ ఆచంట,రామ్ ఆచంట నిర్మిస్తున్నారు.
మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా,సాయి మాధవ బుర్రా రచన సహకారం అందిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు మొదటివారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
శర్వానంద్ ప్రస్తుతం సమంత హీరోయిన్ గా ’96’ తెలుగు రీమేక్ తో పాటు,కాజల్ హీరోయిన్ గా “రణరంగం” చిత్రాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. నిన్న రిలీజైన రణరంగం టీజర్ కి మంచి స్పందన లభించింది.

సంబంధిత సమాచారం :

More