పాపం.. ఎక్కడైతే మొదలు పెట్టాడో మళ్లీ అక్కడికే వచ్చాడు !

Published on Mar 7, 2019 8:55 pm IST

సినిమా ఇండస్ట్రీలో హిట్ కొడితేనే ఛాన్స్ లు. హిట్ లేని డైరెక్టర్ లో ఎంత క్రియేటివిటీ ఉన్నా, అతనికి అంత త్వరగా అవకాశాలు రావు. అదే ఆ డైరెక్టర్ కి వరుసగా హిట్స్ గాని ఉంటే.. అతను చెప్పిన కథ బాగా లేకపోయినా, హీరోలు కిందామీదా పడి అతనికి డేట్లు ఎడ్జిస్ట్ చేస్తారు. కానీ, ప్లాప్ ల్లో ఉన్న డైరెక్టర్ చెప్పిన కథ ఎంత బాగున్నా.. అతనికి మాత్రం మొఖం చాటేస్తారు. మొత్తానికి ఛాన్స్ లు రావాలంటే హిట్ ఉండాల్సిందే.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. ‘కార్తికేయ’ చిత్రంతో డైరెక్టర్ గా మంచి హిట్ కొట్టి.. ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు చందు మొండేటి. ఆ సినిమా తర్వాత చందు మొండేటికి చాలామంది అడ్వాన్స్ లు ఇచ్చారు. తమతో సినిమా చెయ్యమని కొంతమంది హీరోలూ.. ఆఫర్ చేశారు. ఆలా చేసిందే ‘సవ్యసాచి’ సినిమా. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటించిన ఈ చిత్రం నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫిస్ వద్ద నిలబడలేక పెద్ద అపజయాన్ని మూట్టకట్టుకుంది.

దాంతో చందు మొండేటి నాగార్జునతో అనుకున్న ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. ఇక ఎలాగోలా తన తరువాత సినిమాను ‘శర్వానంద్’తో చేద్దామనుకున్నారు. కానీ శర్వానంద్ మాత్రం, కనీసం కథ కూడా వినకుండానే ప్రస్తుతం తన డేట్లు ఖాళీ లేవు అని చెప్పేశాడట. ఇక చేసేది ఏమిలేక చందు తన తరువాత సినిమాను నిఖిల్ తో చేయబోతున్నాడు.

పాపం చందు మొండేటి తన కెరీర్ ను ఎక్కడైతే మొదలు పెట్టాడో.. మళ్లీ అక్కడికే వచ్చినట్లైంది. నిఖిల్ తో ‘కార్తికేయ’ తీసి తనకు మంచి డిమాండ్ ను తెచ్చుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ఇక ఈ సినిమాను నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :