జాతిరత్నాలు దర్శకుడితో తమిళ హీరో సినిమా?

Published on Jul 13, 2021 2:20 am IST

తమిళ హీరో శివకార్తికేయన్ త్వరలో తెలుగు సినిమాలో నటించబోతున్నాడు. రెమో, సీమరాజా, హీరో వంటి తెలుగు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న శివకార్తికేయన్ జాతిరత్నాలు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న అనుదీప్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. జాతిరత్నాలు సినిమా తర్వాత పలు కామెడీ థ్రిల్లర్ కథలను సిద్ధం చేసుకున్న అనుదీప్ హీరో శివకార్తికేయన్‌కి కథ వినిపించాడని దానికి ఆయన్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం “డాక్టర్” మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న శివకార్తికేయన్ దీని తర్వాత డాన్ చిత్రంతో పాటు అనుదీప్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో నటించబోతున్నట్టు టాక్. అయితే వీరిద్దరి సినిమాని కూడా తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

సంబంధిత సమాచారం :