ఇంట‌ర్వ్యూ : శ్రీసింహా – ‘మత్తు వదలరా’ అందరికీ నచ్చుతుంది.

ఇంట‌ర్వ్యూ : శ్రీసింహా – ‘మత్తు వదలరా’ అందరికీ నచ్చుతుంది.

Published on Dec 23, 2019 2:24 PM IST

సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘మత్తు వదలరా’. కాగా రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో శ్రీసింహా విలేకర్లతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ఈ సినిమా ఎలా మొదలైంది ?

నేను రంగస్థలంకి వర్క్ చేసే టైంలోనే రితేష్‌ రానా నాకు ఈ స్టోరీ చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ కూడా కథ బాగా నచ్చింది. కానీ అప్పటికే వాళ్లకు వరుస సినిమాలు ఉన్నాయి. దాంతో ఈ సినిమా మొదలుపెట్టడానికి కొంత టైం పట్టింది. ఆ మధ్యలో రితేష్‌ ఒక డేమో చేశాడు. మైత్రీ వాళ్లకు అది బాగా నచ్చడంతో ఈ సినిమా మొదలైంది.

 

మీకు యాక్టింగ్ పై ఎప్పుడు ఇంట్రస్ట్ కలిగింది ?

నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేశాను. యమదొంగలో ఎన్టీఆర్ గారి చిన్నప్పటి రోల్ లో నటించాను. చిన్నప్పటి నుండి నాకు యాక్టింగ్ పై ఇంట్రస్ట్ ఉంది. అయితే డిగ్రీ అయిపోయాక ఏదైనా వర్క్ చేద్దామని రంగస్థలం సినిమాకి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పని చేశాను.

 

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టీజర్ రిలీజ్ చేశారు. వారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది ?

మాకు చిన్నప్పటి నుండీ ఎన్టీఆర్ గారి అంటే అభిమానం. ఆయన మా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో సినిమా పై ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. అలాగే చరణ్ గారు టీజర్ ను రిలీజ్ చేశారు. రంగస్థలం చేసేటప్పటి నుండీ ఆయనతో క్లోజ్ గా మూవీ అయ్యే అవకాశం వచ్చింది. ఆయన చాల సలహాలు ఇస్తారు.

 

ఈ సినిమా నుండి ప్రేక్షుకులు ఏమి ఆశించొచ్చు ?

సినిమా కొత్తగా ట్రై చేశాము అండి. సినిమాలో కథ చాల ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో మంచి సస్పెన్స్ కూడా ఉంటుంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. అందరికీ నచ్చుతుంది.

 

సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

ఒక ఊరు నుండి వచ్చిన ఒక డెలివరీ బాయ్. చాలీచాలని జీతంతో ఇబ్బంది పడే అతనికి ఒక ప్రాబ్లమ్ వస్తే ఎలా అనే కాన్సెప్ట్ తో మూవీ సాగుతుంది. సినిమాలో చాల భాగం రెండు రోజుల కాలపరిమితిలోనే నడుస్తోంది.

 

మీ అన్నయ మ్యూజిక్ డైరెక్టర్ గా మీరు హీరోగా ఒకే సినిమాతో లాంచ్ అవ్వడం ఎలా అనిపిస్తోంది ?

మేము ఇది అసలు ఊహించలేదు అండి. అన్నయ్యకి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, నాకు యాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుండి ఫ్యాషన్. అయితే మేము ఇద్దరం కలిసి పని చెయ్యాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు చాల హ్యాపీగా అనిపిస్తోంది.

 

మీరు హీరోగానే నటిస్తారా లేక వేరే పాత్రలు కూడా చేసే ఆలోచన ఏమైనా ఉందా ?

ఏదైనా కథ అండ్ రోల్ ను బట్టే ఉంటుంది కదా. అయితే హీరోగానే చెయ్యాలి అనే రూల్ అయితే ఏమి లేదు. మంచి రోల్స్ వస్తే ఎలాంటి పాత్రలైనా చేస్తాను.

 

మీ తదుపరి సినిమాలు గురించి ?

ఇంకా ఏమి అనుకోలేదు అండి. ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ రిసీవ్ చేసుకునే దాని బట్టి తరువాత ఏ సినిమా చెయ్యాలని ఆలోచిస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు