హీరో శ్రీకాంత్ ఆపరేషన్ 2019 !

హీరో శ్రీకాంత్ ఆపరేషన్ 2019 !

Published on Nov 7, 2018 11:30 AM IST

తాజ్ మహల్, పెళ్లి సందడి, క్షేమంగా వెళ్లి లాభంగా రండి వంటి ఎన్నో ఫామిలీ చిత్రాలలో నటించి మంచి ఫ్యామిలీ హీరోగా ముద్రవేసుకున్నాడు హీరో శ్రీకాంత్. ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకునే శ్రీకాంత్ ఒక వైపు కుటుంబ కథా చిత్రాలు చేస్తూ మరో వైవు ఖడ్గం, మహాత్మా, ఆపరేషన్ దుర్యోధన, టెర్రర్ లాంటి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు కూడా చేసి తనలోని విలక్షణ నటుడుని టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయం లో స్థానం సంపాదించుకున్నాడు. కాలానికి అనుగుణంగా మారుతూ హీరో పాత్రలే కాకుండా మంచి క్యారెక్టర్ యాక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. శంకర్ దాదా జిందాబాద్, గోవిందుడు అందరివాడు, సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో క్యారెక్టర్ యాక్టర్ గా నటించి మెప్పించాడు.

కాగా 1991 లో పీపుల్ ఎన్ కౌంటర్ చిత్రం తో మొదలైన తన నటన ప్రస్థానం 27 ఏళ్ళ గా కొనసాగుతూనే ఉంది. ఈ 27 ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో అవార్డులు మరెన్నో తీపి గుర్తులు. ఇక తాజాగా కరణం బాబ్జి దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం ‘ఆపరేషన్ 2019’. మంచు మనోజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి షకీల్ సంగీతం అందిస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు , సుమన్ , దీక్ష పంత్ తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు