‘వి’ మూవీలో చాలా కీలకంగా సుధీర్ రోల్

Published on Feb 18, 2020 9:54 pm IST

హీరో సుధీర్ ‘వి’ మూవీలో పోలీస్ అధికారి పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కిల్లర్ నాని ని వెతికే పోలీస్ గా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. సుధీర్ రోల్ ఈ చిత్రంలో చాలా కీలకం అని తెలుస్తుంది. నాని డేంజరస్ కిల్లర్ పాత్ర చేస్తుండగా అతన్ని అడ్డుకునే సమర్ధవంతమైన పోలీస్ గా సుధీర్ పాత్ర సినిమాకు చాలా కీలకం కానున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఇక ఐ పి ఎస్ అధికారిగా సుధీర్ చాల ఫిట్ అండ్ స్టైలిష్ గా ఉన్నాడు. చాలా కాలం తరువాత తన సమర్ధతకు తగ్గ మంచి రోల్ సుధీర్ దక్కించుకున్నారు.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చ్ 25న ఉగాది కానుకగా ‘వి’ మూవీ విడుదల కానుంది. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హీరో నాని 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More