ఇంటర్వ్యూ : సుమంత్ అశ్విన్ – ‘ఇదే మా కథ’ చెప్పినపుడు చాలా ఎగ్జైట్ అయ్యాను

Published on Sep 29, 2021 2:04 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్నటువంటి పలువురు యువ హీరోల్లో సుమంత్ అశ్విన్ కూడా ఒకడు. తాను సహా సీనియర్ నటుడు శ్రీకాంత్, భూమిక తదితర కీలక నటీనటులు కలయికలో చేసిన లేటెస్ట్ చిత్రం “ఇదే మా కథ”. మరి ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్న సందర్భంలో హీరో సుమంత్ అశ్విన్ లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. మరి ఇందులో తాను ఇంకా ఎలాంటి ఆసక్తికర అంశాలు చెప్పాడో చూద్దాం..

చెప్పండి సినిమా బేసిక్ ప్లాట్ ఏంటి ఎలా ఉంటుంది?

సినిమాలో కనిపించే మెయిన్ లీడ్ లో ఒకొక్కరికి ఒక్కో కథ గోల్ ఉంటాయి. శ్రీకాంత్ గారికి ఒక ఒక కథ భూమిక గారికి ఒక గోల్ ఇలా అందరికీ ఒక్కో అంశం ఉంటుంది. అలాగే మధు గారికి ఒక గోల్ ఇలా వేరేవేరేగా కొంతమంది బయలుదేరినప్పుడు మధ్యలో కలుసుకుంటే ఎలా ఉంటుంది? అక్కడ నుంచి వారికి జర్నీ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యారా లేదా అన్నది హైదరాబాద్ నుంచి లడాఖ్ వరకు జర్నీ లో ఉంటుంది.

మరి నాలుగు కథలు నలుగురువి ఏమన్నా లింక్ ఉంటుందా?

లింక్ అంటే.. ఎవరితో ఎవరికీ కూడా సంబంధం ఉండదు కానీ ఒకరినొకరు కలుసుకున్నాక మంచి ఫ్రెండ్షిప్ అయ్యి అవతల వారి కోసం కోరుకుంటారు. నా గోల్ రీచ్ అవ్వాలని శ్రీకాంత్ గారు వాళ్ళవి నెరవేరాలని నేను ఇలా ఈరకంగా లింక్ ఉంటుంది.

ఇలాంటి కాన్సెప్ట్ అయితే తెలుగులో చాలా తక్కువ మరి డైరెక్టర్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?

అవును రోడ్ జర్నీ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తక్కువే.. అలాగే ఇలాంటి సినిమాలు అంటే మంచి లొకేషన్స్ అవీ చూపిస్తే కొంతసేపు వరకు మాత్రమే బాగుంటుంది. వాటికి స్టోరీ కానీ రోల్స్, ఎమోషన్స్ అన్నీ కరెక్ట్ గా ఉండాలి. అప్పుడు డైరెక్టర్ చెప్పినపుడు ఇవన్నీ కూడా నాకు కరెక్ట్ గా ఉన్నాయి అనిపించింది. అప్పుడు ఎగ్జైట్ అయ్యాను..

మరి రోడ్డు ప్రమాదాలు ఏమన్నా జరిగాయా షూట్ టైం లో?

లేదు దేవుడి దయవల్ల అలాంటివి ఏమీ జరగలేదు. సినిమా రిస్కీ గా ఉంటుంది. క్లైమాక్స్ లో ఒక రేస్ ఎపిసోడ్ ఉంటుంది. అది కూడా ఐస్ మీద, నేను ఇక్కడ అంటే రోడ్లు పైన నడిపేస్తాను కానీ అక్కడ అలా కాదు దానికి మా టీం స్టంట్ మాస్టర్స్ చాలా కష్టపడ్డారు ముందే వెళ్లి ట్రైన్ అయ్యి అంతా చెయ్యడం వల్ల ఎక్కడా ఏం కాలేదు.

భూమిక గారితో వర్క్ ఎలా ఉందో చెప్పండి?

భూమిక గారు మా ప్రొడక్షన్ హౌస్ లో ఇది రెండో సినిమా అనుకుంటా. అప్పుడు ఒక్కడు టైం లో ఆమె ఫోటో ఒకటి పేపర్ లో చూసి ఈ హీరోయిన్ చాలా బాగుంది అనుకున్నా. కానీ ఇపుడు ఇలా యాక్ట్ చేస్తా అనుకోలేదు. సినిమాలో తనని అక్క అని పిలుస్తా. తాను కూడా సినిమాలో చాలా కష్టపడ్డారు. చిన్న లాంగ్ షాట్ కి కూడా డూప్ ని ఒప్పుకోలేదు తానే చేస్తా అన్నారు. ఇంకా పుస్తకాలు ఎక్కువ చదువుతారు. ఆమెతో వర్క్ చాలా బాగుంది.

మీ డైరెక్టర్ గురు పవన్ కోసం చెప్పండి?

గురు కూడా మొదట రైటర్ గానే వచ్చాడు. చాలా ఇష్టం తనకి. ఈ సినిమా అయ్యాక పార్ట్ కూడా తియ్యాలని ప్లాన్ లో ఉన్నాడు. సినిమా స్టార్ట్ అవ్వకముందు మాకు ఈజీగా ఉండాలని తాను ఒక జర్నీ చేసాడు. స్వయంగా జర్నీ చేసి ఎవరెవరికి ఎలాంటి డ్రెస్సింగ్ ఇవ్వాలి అన్ని చాలా బాగా రీసెర్చ్ చేశారు. డైలాగ్స్ కూడా స్పాట్ లో రాయగలడు.

చాలా కాలం తర్వాత మీ నాన్న గారి డైరెక్షన్ లో సినిమా..ఆయన కోసం చెప్పండి

నాన్న గారితో ఇంతకు ముందు తూనీగ తూనీగ కూడా చేశాను. ఆయన ఎప్పుడు కూడా ఒక సినిమా తర్వాత మళ్ళీ అదే టైప్ సినిమా చెయ్యాలి అనుకోరు. అప్పుడు మనసంతా నువ్వే నుంచి హై బడ్జెట్ లో బడ్జెట్ ఇలా అన్నిటిలో ఉన్న జానర్ మారుస్తూనే కొత్తగా ట్రై చెయ్యాలి అనుకుంటారు. అలాగే ఇప్పుడు డర్టీ హరి సినిమా తర్వాత అంతా నెక్స్ట్ కూడా ఇలాంటి సినిమానే తీస్తా అనుకోవచ్చు కానీ 7 డేస్ 6 నైట్స్ సినిమా అలా ఉండరు. కంప్లీట్ వేరేగా కామెడీ డ్రామాలా ఉంటుంది.

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి?

ప్రస్తుతం 7 డేస్ 6 నైట్స్ షూట్ అయ్యిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రిలీజ్ కూడా తొందరలోనే ఉంటుంది. అలాగే ఇంకో ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ కూడా ఉంది అని నేను చెయ్యను వేరే వాళ్ళు చేస్తారు.

ఫైనల్ గా ‘ఇదే మా కథ’ ఆడియెన్స్ కి ఏం చెప్తుంది? ఎందుకు చూడాలి?

సినిమాలో స్టోరీ, నలుగురు మధ్య కెమిస్ట్రీ, మంచి లొకేషన్స్ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా వచ్చింది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కోసం కూడా అంతా చెప్తున్నారు. ఇవేవి అయితే ఎవరినీ నిరాశపరచవు అనుకుంటున్నా.

సంబంధిత సమాచారం :