నీట్‌ పరీక్షలు రద్దు చేయమంటున్న హీరో !

నీట్‌ పరీక్షలు రద్దు చేయమంటున్న హీరో !

Published on Jun 20, 2021 9:19 PM IST

హీరో సూర్యకు సామాజిక సేవ ఎక్కువ. పేదలకు ఎన్నో రకాలుగా ఆయన ఎపుడు సేవ చేస్తూనే ఉంటారు. అలాగే సమాజంలో అన్యాయం పై సూర్య ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. కాగా తాజాగా కేంద్ర విద్యావ్యవస్థను మరోసారి తప్పుబడుతూ సూర్య ఒక ప్రకటన విడుదల చేశాడు. ఇప్పుడు కరోనా పరిస్థుతుల మధ్య నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌) ప్రవేశ పరీక్షలు నిర్వహించడం వల్ల స్టూడెంట్స్ కు ఎక్కువ నష్టం చేస్తోంది.

ఈ నిర్ణయం వారి ప్రాణాలతో చెలగాటం ఆడడమే. కాబట్టి, అలాంటి ప్రవేశపరీక్షను రద్దు చేయడమే మంచిది’ అంటూ సూర్య ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాడు. అలాగే తన ఫౌండేషన్‌ తరపున ప్రభుత్వ ప్యానెల్‌ కు నివేదిక సమర్పించిందని సూర్య ట్విటర్‌ లో పోస్ట్ చేస్తూ ‘ఇలాంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షా విధానాలు సామాజిక న్యాయానికి విరుద్ధం. స్టూడెంట్స్‌ను బలి పశువుల్ని చేయొద్దు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యావ్యవస్థ తీరుతెన్నులను.. రాష్ట్రాలకే వదిలేయడం మంచిది’’ అంటూ సూర్య తన ప్రకటనలో స్పష్టంగా రాసుకొచ్చాడు. దాంతో సూర్య పై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు