‘జై భీమ్’ నిజ జీవిత బాధితురాలు సినతల్లికి 15 లక్షల చెక్కు..!

‘జై భీమ్’ నిజ జీవిత బాధితురాలు సినతల్లికి 15 లక్షల చెక్కు..!

Published on Nov 17, 2021 1:11 AM IST


తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘జై భీమ్‌’. ఈ నెల 2వ తేదిన అమెజాన్‌ ఓటీటీ ద్వారా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తమిళనాడుకు చెందిన జస్టిస్‌ చంద్రు కెరీర్‌లో కీలకంగా నిలిచిన ఓ కేసు ఆధారంగా ఈ సినిమాను తీశారు. చేయని తప్పులో భర్తను పోగొట్టుకున్న సినతల్లి (లిజో మోల్‌ జోసే) న్యాయం కోసం పోరాడిన విధానం ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది.

అయితే నిజజీవితంలో ఈ పోరాటం చేసిన వ్యక్తి పార్వతి అమ్మాళ్‌. ప్రస్తుతం ఆమె ఆర్థిక పరిస్థితి చూసి చలించిపోయిన హీరో సూర్య ఆమెకు 10 లక్షలను ఇవ్వగా, 2D ఎంటర్‌టైన్మెంట్స్ కూడా 5 లక్షల రూపాయలను ఇచ్చింది. మొత్తం 15 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చెక్కును పోరాట యోధుడు, తమిళనాడు సిపియం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బాలకృష్ణన్ చేతుల మీదుగా పార్వతి అమ్మాళ్‌కి అందచేశారు. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మొత్తంపై ప్రతినెలా వచ్చే వడ్డీని ఆమెకు అందేలా చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు