ఆవ్యాఖలపై తీవ్ర మనస్థాపానికి గురైన హీరో సూర్య.

Published on Jul 21, 2019 12:00 am IST

నటుడు సూర్య కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలంగా మారాయి. ప్రముఖ విద్యా సంస్థలలో వైద్య విద్య అభ్యసించడానికి నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష నీట్ ను నిర్వహించే విధానం సరిగా లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వేడి రాజేస్తున్నాయి. దీనితో సంభందం ఉన్న కొందరు వ్యక్తులు సూర్యని టార్కెట్ చేస్తూ, చేస్తున్న వ్యాఖ్యలు ఆయనను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి.

ఆయన ఆవేదనను తెలియజేస్తూ ఓ లేఖను విడుదల చేశారు. నీట్‌ గురించి మాట్లాడే అర్హతలేదంటూ కొంతమంది చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. విద్యాభ్యాసంలో ఇబ్బందులపై మాట్లాడితే తనను టార్గెట్‌ చేయడం బాధకలిగిందని, తన భార్య జ్యోతిక సినిమాను నిరసన కారులు అడ్డుకోవడం సరైంది కాదన్నారు. జాతీయ పౌరుడిగా తనకు మాట్లాడే అర్హత ఉందని, ప్రతి పేదవాడికి ఉన్నత విద్యను అభ్యసించే హక్కు ఉందన్నారు సూర్య. సూర్య కుటుంబం పేద విద్యార్థుల కొరకు ఒక స్కూల్ నడుపుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :