ఉదయాన్నే వెంకీ కాల్ తో షాకైన యంగ్ హీరో

Published on Jun 29, 2019 12:19 pm IST

శ్రీవిష్ణు,ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో నివేదా థామస్,నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా తెరకెక్కిన “బ్రోచేవారెవరురా” మూవీ నిన్న విడుదలైంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరక్కించిన ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. హీరో శ్రీవిష్ణు ఈ చిత్రంతో ఓ మంచి విజయం తనఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు. ముఖ్యంగా నివేదా థామస్ నటనతో పాటు,ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ కామెడీ చిత్ర విజయానికి దోహదం చేశాయి.

నేటి ఉదయం శ్రీవిష్ణుకి హీరో వెంటేష్ కాల్ చేసి మరి అభినందించారట. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు శ్రీవిష్ణు. నా రోల్ మోడల్ అయిన హీరో వెంకటేష్ గారు ఫోన్ చేసి మరి అభినందించడం ఎంతో గర్వకారణం అని తన ఫీలింగ్ ని పంచుకున్నారు ఈ యంగ్ హీరో.

సంబంధిత సమాచారం :

More