వెంకీ కుమార్తె ‘ఆశ్రిత’ అరుదైన రికార్డు !

Published on Jul 4, 2021 7:02 pm IST

సీనియర్ హీరో వెంకటేష్‌ కుమార్తె ‘ఆశ్రిత’ ఇన్‌ స్టాగ్రామ్‌లో రిచ్చేస్ట్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆశ్రిత ఇన్‌ స్టాగ్రామ్‌లో ఇన్ఫినిటీ ప్లాటర్‌ అనే పేరుతో ఆమె ఒక అకౌంట్‌ క్రియేట్‌ చేసి కుకింగ్‌ వీడియోలు షేర్‌ చేస్తున్నారు. అలాగే ఆశ్రితకు 13 లక్షలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. కాగా ఇటీవల హోపర్‌ డాట్‌ కం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రెటీల జాబితాను అధికారికంగా విడుదల చేసారు.

కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో హాలీవుడ్‌ నటుడు క్రిస్టియానో రోనాల్డో ప్రపంచలోనే నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే ఈ లిస్ట్ లో ఇండియా నుంచి విరాట్‌ కోహ్లి, నటి ప్రియాంక చొప్రా మొదటి స్థానాల్లో ఉన్నారు. వెంకటేష్‌ కూతురు ఆశ్రిత కూడా చోటు ఈ లిస్ట్ లో సంపాదించుకున్నారు. ఆశ్రిత ప్రపంచవ్యాప్తంగా 377 స్లానంలో నిలవగా.. ఆసియా మొత్తంలో 27వ ర్యాంకులో నిలిచింది.

సంబంధిత సమాచారం :