‘విజయ్ దేవరకొండ’కు పోటీగా తమిళ స్టార్ హీరో.. !

Published on Mar 13, 2019 12:10 pm IST

విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మణంలో ‘హీరో’ అనే పేరుతో ఓ స్పోర్ట్స్ డ్రామా రాబోతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళంలో ఈ చిత్రం ఏకకాలంలో తెరకెక్కనుంది.

అయితే, ఇప్పుడు విజయ్ ‘హీరో’ సినిమాకి ఓ అడ్డంకి వచ్చింది. ఈ ఉదయం, తమిళ్ హీరో శివ కార్తీకేయన్ యొక్క తాజా చిత్రానికి కూడా హీరో అనే టైటిల్ పెట్టారు. ఇప్పుడు తమిళంలో విజయ్ దేవరకొండ – శివ కార్తీకేయన్ లలో ఎవరో ఒక్కళ్ళు తమ సినిమా టైటిల్ మార్చుకోవాలి, మరి ఈ ఇద్దరి హీరోల్లో ఎవరు వెనెక్కి తగ్గి తమ సినిమా పేరు మార్చుకుంటారో చూడాలి.

ఇక ‘హీరో’ అనే టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి కూడా గతంలో ఓ సినిమా చేసారు. ఆ సినిమా సూపర్ హిట్ కూడా అయింది. అయితే ఆ తరువాత ‘హీరో’ అనే టైటిల్ తో నితిన్, అలాగే కొంతమంది హీరోలు కూడా సినిమాలు చేశారు. కానీ అవి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలయ్యాయి. మరి విజయ్ దేవరకొండకు ఈ టైటిల్ ఎంతవరకూ కలిసి వస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More