అందరికీ న్యాయం చేసిన హీరో విజయ్

అందరికీ న్యాయం చేసిన హీరో విజయ్

Published on Apr 22, 2020 9:00 PM IST

తలపతి విజయ్ తాను ప్రత్యేకం అని చాటుకున్నారు. ఆయన వివిధ రాష్ట్రాలు మరియు సినీ పరిశ్రమల కోసం ఏకంగా 1.30 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. కరోనా వైరస్ ని నియంత్రించే పనిలో మద్దతుగా ఆయన తెలుగు రాష్ట్రాలైన ఏపీ మరియు తెలంగాణా ప్రభుత్వాలకు చెరో 5 లక్షల చొప్పున 10 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించడం జరిగింది. ఇక ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ కొరకు 25 లక్షలు, తమిళ నాడు గవర్నమెంట్ కి 50 లక్షలు ప్రకటించారు. పక్కనే ఉన్న కర్ణాటకకు 5 లక్షలు మరియు కేరళ రాష్ట్రానికి మరో 10 లక్షలతో పాటు, పాండిచ్చేరి ప్రభుత్వానికి 5 లక్షలు దానం చేయడం జరిగింది.

ఇక ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా కొరకు ఆయన 25లక్షలు ప్రకటించారు. చాలామంది హీరోలు తమ సొంత రాష్ట్రాలు, పరిశ్రమలకు విరాళాలు ప్రకటించగా విజయ్ అందరికీ ఇలా ఎంతో కొంత ఆర్ధిక సాయం చేశారు. ఇక దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న మాస్టర్ మూవీ షూటింగ్ పూర్తి కాగా విడుదలకు సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు