“అయో’గ్య” ఆరోగ్యం జాగ్రత్త !

Published on Mar 11, 2019 2:26 pm IST

ఎన్టీఆర్ ను హిట్ ట్రాక్ ఎక్కించిన ‘టెంపర్’ చిత్రం తమిళ్ రీమేక్ లో ‘అయోగ్య’ టైటిల్ తో విశాల్ మరియు రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా రాబోతున్న విషయం తెలిసందే. ఈ సినిమా ఏప్రిల్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓ సాంగ్ బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం ఆ సాంగ్ కు సంబంధించి షూట్ చేస్తున్నారు. షూట్ చేసే సమయంలో విశాల్ కు గాయాలు అయినట్లు తెలుస్తోంది. విశాల్ మోచేయికి, కాలికి గాయం అయిందట.

ఇక ఇప్పటికే విడుదల అయిన టీజర్ ట్రైలర్ లో మూవీ కాన్సెప్ట్ తో పాటు విశాల్ కూడా బాగా హైలెట్ గా నిలిచాడు. విశాల్ లోని మాస్ ఆటిట్యూడ్ తో పాటు యాక్షన్ అంశాలను సినిమాలో బాగా ఎలివేట్ చేశారట. మరి తెలుగు మరియు హిందీలోలాగే… తమిళ్ లో కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి. కాగా అయోగ్య థియేట్రికల్ రైట్స్ ను స్క్రీన్ సీన్ సంస్థ దక్కించుకుంది.

సంబంధిత సమాచారం :

More