తన క్రష్ ఎవరో బయటపెట్టిన ప్రియాంక జవాల్కర్..!

Published on Aug 11, 2021 10:27 pm IST

ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా కనిపిస్తుంది హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. టాక్సీవాలా సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన తెలుగు బ్యూటీ ప్రియాంక తాజాగా తిమ్మరుసు, SR కళ్యాణమండపం సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన మనసులోని మాటలను బయటపెట్టింది.

తనకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ అంటే క్రష్‌ అని, విజయ్‌ దేవరకొండ అంటే చిల్ అని చెప్పుకొచ్చింది. అలాగే హీరో సత్యదేవ్ గురుంచి మాట్లాడుతూ ఆయన చాలా హార్డ్ వర్కర్ అని, కిరణ్ అబ్బవరం చాలా ఇన్నోసెంట్ పర్సన్ అని చెప్పుకొచ్చింది. ఇక సినిమాల గురుంచి మాట్లాడుతూ కొన్ని కథలు విన్నానని త్వరలోనే వాటిలో బెస్ట్ అనిపించే వాటిని ఫైనల్ చేస్తానని చెప్పింది.

సంబంధిత సమాచారం :