వేధింపులు తట్టుకోలేను..ఆత్మ హత్య చేసుకుంటా..!

Published on Jul 1, 2020 10:24 pm IST


సోషల్ మీడియా వేధింపులు తారలకు సర్వ సాధారణం అయిపోయాయి. వీటిని అసలు పట్టించుకోని వారు తమ పని తాము చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు. ఐతే కొందరు మాత్రం ఈ వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ బోజ్ పురి హీరోయిన్ కి కూడా ఈ తరహా వేధింపులు ఎదురయ్యాయి. దీనితో ఆమె సోషల్ మీడియా వేదింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హీరోయిన్ రాణి ఛటర్జీ దీని గురించి మాట్లాడుతూ…సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతున్న ధనుంజయ్ సింగ్ అనే వ్యక్తి అత్యంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. నన్ను ముసలిదాన అంటూ సంభోదిస్తూ అతడు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే ఆందోళన కలుగుతుంది. ఒకానొక సమయంలో అతడి వల్ల డిప్రెషన్ కు వెళ్తున్నాను. ఆ సమయంలో నాకు ఆత్మహత్య తప్ప మరే మార్గం లేదు అన్నట్లుగా అనిపిస్తుంది ఆమె తెలిపింది.

మొదట్లో వాటిని పట్టించుకోకూడదు అనుకున్నాను కాకి అతను మరీ నీచంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. బ్లాక్ చేసినా ఇంకా అతడి నుండి ఎంత దూరంగా ఉన్నా కూడా అతడు మాత్రం నన్ను వదిలి పెట్టడం లేదు అంటూ ఫిర్యాదులో పేర్కొంది. అతడి నుండి తనను కాపాడకుంటే మాత్రం నేను ఏ క్షణంలో అయినా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :

More