కరెంట్ బిల్ చూసి షాక్ అయ్యానంటున్న తాప్సి.

కరెంట్ బిల్ చూసి షాక్ అయ్యానంటున్న తాప్సి.

Published on Jun 28, 2020 11:30 PM IST

హీరోయిన్ తాప్సి తన ముంబై అపార్ట్మెంట్ కి వచ్చిన కరెంట్ బిల్ కి చూసి షాక్ అయ్యింది. సాధారణంగా వచ్చే బిల్లుకు పదిరెట్లు ఎక్కువ రావడంతో ఆమె షాక్ తిన్నారు. ఊహించని ఆ పరిణామాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాప్సి లాంటి హీరోయిన్ కి కూడా చుక్కలు చూపించిన ఆ కరెంట్ బిల్ ఎంత అనే కదా మీ డౌట్. తాప్సి అపార్ట్మెంట్ కి ఏకంగా ఓ నెలకి 36000 రూపాయలు బిల్ రావడం జరిగింది. దీనితో ఆమె ట్విట్టర్ లో పోస్ట్స్ పెట్టారు.

ఆమె ట్విట్టర్ లో స్పందిస్తూ..’ఇది మా అపార్ట్‌మెంట్‌ బిల్లు. క్లీనింగ్‌ కోసమని వారంలో ఒక రోజు ఈ ఆపార్ట్‌మెంట్‌కు వెళ్తుంటాం. మాములు రోజుల్లో ఎవరూ ఉండరు. ఈ బిల్లు చూస్తుంటే మాకు తెలియకుండానే ఎవరో ఈ ఆపార్ట్‌మెంట్‌ను వినియోగిస్తున్నారనే భయం కలుగుతోంది. నిజాన్ని వెలికితీసేందుకు నాకు సహాయం చేయడంటూఎలక్ట్రిసిటీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌కు ట్యాగ్ చేస్తూ తాప్సీ ట్వీట్‌ చేసింది. మూడు నెలల వ్యవధిలోనే పెద్ద మొత్తంలో కరెంట్‌ బిల్లు పెరగడానికి కారణం ఏంటి? ఏ రకమైన బిల్లును వసూలు చేస్తున్నారని ఎలక్ట్రిసిటీ అధికారులను ఆమె ప్రశ్నించారు. కాగా తాప్సీ ట్వీట్‌పై స్పందించిన ఎలక్ట్రిసిటీ అధికారులు.. మీటర్‌ రీడింగ్‌ ఆధారంగా తాము బిల్లు కొట్టామని వివరణ ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు