కరోనా నుండి విముక్తి.. షూట్ కోసం హీరోయిన్ వెయిటింగ్ !

Published on Jun 20, 2021 10:31 pm IST

హీరోయిన్ ఆండ్రియాకు కరోనా వైరస్‌ సోకడంతో ఆమె ఒక నెలరోజుల పాటు హోమ్ క్వారంటైన్‌ లోనే ఉండాల్సి వచ్చింది. అయితే 14 రోజులకు తన క్వారంటైన్‌ ముగిసినా.. ఆండ్రియా మరో 14 రోజుల పాటు తన గదికే పరిమితమైంది. మొత్తానికి ఈ రోజుతోటి ఆమెకు కరోనా నుంచి పూర్తిగా విముక్తి కలిగిందని చెప్పుకొచ్చింది. ఇక ఆండ్రియా ప్రస్తుతం షూటింగుల్లో పాల్గొనేందుకు ఎదురుచూస్తోందట.

ఆండ్రియా చేతిలో ‘అరణ్‌మనై-3’, ‘నో ఎంట్రీ’, ‘వట్టం’, ‘మాళిగై’, ‘పిశాచు-2’ లాంటి చిత్రాలతో పాటు మరో రెండు కొత్త సినిమాలు కూడా ఉన్నాయి. అన్నట్టు ఈ నెల 25 నుండి వట్టం సినిమా షూటింగ్‌ మొదలుకానుంది. ఈ సినిమా షూట్ లో ఆండ్రియా పాల్గొనబోతుంది. ఇక తనకు కరోనా తగ్గిన నేపథ్యంలో ఆండ్రియా స్పెషల్‌ కాస్ట్యూమ్‌ ధరించి, వివిధ ఫోజుల్లో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

సంబంధిత సమాచారం :